జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:31 IST)
ఈ కాలంలో చర్మంతోపాటు కేశ సంరక్షణ కూడా చాలా అవసరం. లేదంటే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై శిరోజాలు బలహీనమవుతాయి. జుట్టు జీవం కోల్పోయి పీచులా మారుతుంది. ఇలాంటి సమస్యలన్నింటికి తేనె, ఆలివ్ నూనెలతో చక్కని పరిష్కార మార్గం దొరుకుతుంది. మరి ఆ మార్గాలేంటో.. ఓసారి తెలుసుకుందాం...
 
తలస్నానం చేసే ముందుగా అంటే.. అరగంటకు ముందుగా కప్పు తేనెలో పావుకప్పు ఆలివ్ నూనె కలిపి తలకు మర్దనా చేసుకోవాలి. పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే చుండ్రు కూడా రాదు. 
 
కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
తేనెలోని విటమిన్స్, ఖనిజ లవణాలు జుట్టుకు ఎంతో మేలుచేస్తాయి. తేనె జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు పట్టుకుచ్చులా పెరగాలంటే.. తలస్నానం చేసిన తరువాత మగ్గు నీటిలో అరకప్పు తేనె, నిమ్మరసం కలిపి జుట్టును రాసుకోవాలి. 2 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments