Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశాలు బలంగా... ఒత్తుగా పెరిగేందుకు...

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (21:50 IST)
బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి. 
 
250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది.
 
మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గోరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. 
 
పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్‌ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహిందీ పొడి దొరుకుతుంది. దానితో సహజసిద్ధమైన డైని తయారుచేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు. 
 
ఉసిరికపొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు (ఆమ్లా) చౌకగా లభ్యమయ్యేకాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని... వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యం అయ్యే చౌకరకాల షాంపూలను, సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

తర్వాతి కథనం
Show comments