Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లకు... నిమ్మరసంలో కాస్త ఉప్పును కలిపి రాసుకుంటే?

కాళ్ల పగుళ్లు మీద చాలామంది దృష్టి పెడుతుంటారు. కానిపాదం పైభాగంలోనూ మురికి, జిడ్డు పేరుకుపోతుంటుంది. అది తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు. బంగాళాదుంప ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసుక

Webdunia
బుధవారం, 18 జులై 2018 (11:45 IST)
కాళ్ల పగుళ్లు మీద చాలామంది దృష్టి పెడుతుంటారు. కానిపాదం పైభాగంలోనూ మురికి, జిడ్డు పేరుకుపోతుంటుంది. అది తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు. బంగాళాదుంప ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. అందులో దూదిని ముంచి కాళ్లను తుడవాలి. తరువాత ఆ రసాన్ని పాదాలకు పట్టించాలి. కాసేపటి తరువాత బంగాళాదుంప ముక్కతో రుద్ది కడిగేస్తే మురికి తొలగి కాళ్లు శుభ్రపడుతాయి.
 
కమలా పండు తొక్కల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు చెంచాల తీసుకుని అందులో కొద్దిగా తేనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పాదాల మీద మర్దన చేసుకుని ఆరాక చల్లని నీటితో కడుక్కుంటే మురికిపోతుంది. నిమ్మరసంలో ఉప్పును చేర్చి పాదాలకు మర్దన చేసుకోవాలి. గోళ్ల మీద కూడా ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. టమోట రసంలో కాస్త పసుపును కలిపి పాదాలకు రాసుకుంటే నలుపుదనం తొలగిపోతుంది.
 
ఇలా చేయడం వలన గోళ్లు చుట్టూ ఉండే మట్టి తొలగిపోతుంది. చర్మం మీద మురికి కూడా తొలగిపోతుంది. కాసేపటి తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కప్పు నీళ్లలో బాదం గింజలు నానబెట్టుకోవాలి. మర్నాడు వాటిని మెత్తగా రుబ్బి కాళ్లకు పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత నిమ్మరసంతో తడిపి మర్దన చేస్తే నిర్జీవంగా మారిన చర్మానికి కొత్త కాంతి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

తర్వాతి కథనం
Show comments