Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం పొద్దస్తమానం జిడ్డుగా మారుతోందా..?!

Webdunia
గురువారం, 7 ఆగస్టు 2014 (19:33 IST)
చాలా మంది మహిళలు లేదా యువకులు పొద్దస్తమానం ఫేస్ వాష్ చేస్తున్నా.. వారి ముఖం జిడ్డుగా మారుతుంది. ఇలా జిడ్డు చర్మం గలవారు.. ఇంట్లోనే దొరికే వస్తువులతో పేస్ ప్యాక్ తయారు చేసి, దాన్ని ఉపయోగించి జిడ్డు ముఖాన్ని కాంతివంతం చేయవచ్చు. అదెలాగంటే... పది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. కోడిగుడ్డు తెల్లసొనను మాత్రమే బాగా గిలకొట్టి, అందులోనే ద్రాక్షపండ్లను, నిమ్మరసాన్ని కూడా వేసి మరికాసేపు గిలకొట్టాలి.
 
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే నేచురల్ క్లెన్సర్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ద్రాక్షరసం వల్ల చర్మానికి మృధుత్వం వస్తుంది. కోడిగుడ్డు వల్ల చర్మం వదులుకాకుండా కాపాడుతుంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పేస్ ప్యాక్‌ను పొడి చర్మం గలవారు మాత్రం వాడకూడదు. ఒకవేళ వాడినట్లయితే.. వారి చర్మం మరింత పొడిబారిపోతుంది.
 
ఒకవేళ ఇలా పండ్లు, సౌందర్య సాధనాలను ఉపయోగించి పేస్ ప్యాక్ చేసేందుకు సమయం, ఓపికా లేనప్పుడు... నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో ముఖాన్నంతటినీ బాగా రుద్ది పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్లయితే... ముఖంలో జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా అవుతుంది.

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments