Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మానికి మేలు చేసే డార్క్ చాక్లెట్: వంటల్లో ఓ చెంచా కొబ్బరినూనె వాడితే?

చర్మానికి మేలు చేయాలంటే.. డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లు, ఫ్యాటీయాసిడ్లు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కో

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:25 IST)
చర్మానికి మేలు చేయాలంటే.. డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లు, ఫ్యాటీయాసిడ్లు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కోకో రక్తప్రసరణపై సానుకూల ప్రభావాన్ని చూపడం వల్ల పరోక్షంగా చర్మానికి మేలు జరుగుతుంది. అలాగే డార్క్‌ చాక్లెట్‌లోని పోషకాలు అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి కూడా. అలాగని అతిగా తింటే మాత్రం మొటిమలతోపాటూ, అధికబరువూ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
 
అలాగే ముఖంపై ముడతలను నివారించుకోవాలంటే.. ఎరుపు రంగు క్యాప్సికంను పచ్చిగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో సి, బి6 విటమిన్లూ, పీచు, కెరొటినాయిడ్లూ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ముడతల్ని నివారిస్తాయి. అదే సమయంలో మొటిమలు రాకుండా అడ్డుకోవడమే కాదు, రక్తప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తాయి. తరచూ దీన్ని తీసుకోగలిగితే వార్థక్యపు ఛాయలు చాలామటుకూ దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కొబ్బరినూనె వంటల్లో చెంచా వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కెలొరీలు ఎక్కువైనా, లారిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఇందులో ఉంటుంది. దీనికి యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ గుణాలు ఉంటాయి. వంటల్లో కొన్ని చెంచాల నూనె వాడినా ఇన్‌ఫెక్షన్లూ, కొన్నిరకాల వైరస్‌లూ దరిచేరవు. విటమిన్‌ ఇ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments