Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండ్రుకు చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (16:37 IST)
చుండ్రుని పోగొట్టుకోవడం కోసం చాలా మంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే దీన్ని పోగొట్టుకోవచ్చు. జుట్టుని ఓ సారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకి మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.
 
మూడు నుంచి అయిదు చెంచాల కొబ్బరి నూనెని రాత్రి పడుకునే ముందు మాడుకి బాగా పట్టించాలి. ఉదయం తక్కువ గాఢత కలిగిన షాంపూతో స్నానం చేయాలి. ఇలా ప్రతి మూడు రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది. 
 
రెండు చెంచాల నిమ్మరసాన్ని మాడుకి తగిలేలా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. తరువాత కప్పు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం వేసి జుట్టకి పట్టించి వదిలేయాలి. నిమ్మలోని అమ్లతత్వం చుండ్రు పట్టకుండా చూస్తుంది. 
 
అల్లం ముక్కని పేస్టులా చేసి, దానికి కాస్త తేనె కలిపి మాడుకి పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అల్లంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకి కారణమైన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. జుట్టుని మృదువుగా మారుస్తాయి.
----------------------

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments