Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకును తినకుండా పక్కనపెట్టేస్తే.. పోషకాల్ని పడేసినట్టే!

Webdunia
శనివారం, 2 జనవరి 2016 (16:10 IST)
స్త్రీలలో జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుంది. ఎన్ని క్రీములు, షాంపులు వాడిన ఫలితం కనిపించడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వారికి సహజ సిద్ధమైన కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. కరివేపాకు వంటకాలకు రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా మన జుట్టు సంరక్షణకు కావలసిన పోషకపదార్ధాలను అందిస్తుంది. కరివేపాకుని తినకుండా పక్కన పడేస్తే మీరెన్నో పోషకాలను పడేస్తున్నారని అర్ధం చేసుకోండి. కూరకు రుచిని సమకూర్చడమే కాకుండా ఇంకా ఎన్నో విధాలుగా  మీకు ఉపయోగపడుతుంది. 
 
కరివేపాకు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు వత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కరివేపాకు జుట్టు రంగు నలుపుగా, మెరిసేట్టుగా చేస్తుంది. ఒక గిన్నెలో అరకప్పు కొబ్బరి నూనె వేసి, అందులోనే కరివేపాకు వేసి సన్నని మంట మీద వేడిచెయ్యాలి. వేడిచేసిన ఈ నూనెను రోజూ జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య ఉండదు. అలాగే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.
 
కొన్ని కరివేపాకులను తీసుకోని పేస్ట్ చేసుకుని, ఈ మిశ్రమాన్ని పెరుగులో కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఇలా అరగంట ఉంచిన తరువాత హెర్బల్ షాంపూ‌తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది. ముందుగా కరివేపాకును కొంచెం నీరు పోసి రుబ్బుకోవాలి. రుబ్బుకున్నఈ మిశ్రమంలో గుడ్డు తెల్లసొన, కొద్దిగా పెరుగు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments