జిడ్డుకు చెక్ పెట్టే మొక్కజొన్న పిండి.. మేకప్ లేకున్నా మెరుస్తారంతే?

కార్న్ ఫ్లోర్ కూడా ముఖంపై గల జిడ్డు పోగొడుతుంది. మొక్కజొన్న పిండిలో... నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (10:38 IST)
ఏ సీజన్ అయినా చర్మం జిడ్డుగా తయారైతే.. రకరకాల క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ముఖంపై జిడ్డు పేరుకుని మేకప్ వేసుకుంటే.. మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

పసుపు: దీనిలో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి...మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది. 
 
అలాగే స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
ఇక కార్న్ ఫ్లోర్ కూడా ముఖంపై గల జిడ్డు పోగొడుతుంది. మొక్కజొన్న పిండిలో... నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూత వేసుకున్నాక మేకప్‌ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీర్ దాస్‌తో కంగనా రనౌత్ కిస్సింగ్ సీన్.. పెదవులకు గాయం.. అసలు సంగతేంటి?

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

తర్వాతి కథనం
Show comments