Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నీళ్లు, పాలతో సౌందర్య పోషణ.. టిప్స్ ఇవిగోండి..!

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (17:59 IST)
కొబ్బరి బోండాంలోని నీళ్లతో పాటు కొబ్బరి పాలను కూడా సౌందర్య పోషణలో వాడొచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం సన్ టాన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 
అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.
 
చెమటతో చర్మంపై పేరుకుపోయే మురికివల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
 
చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments