Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికే కాదు.. అందానికి మేలైనది క్యారెట్...

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2015 (17:03 IST)
నిత్యం మన వంట గదిలో కనిపించే క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఉపకరిస్తుంది. శక్తిని ఇచ్చే క్యారెట్ సౌందర్య సాధనగా కూడా ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో బీటా కెరొటన్లూ, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు చర్మానికి మెరుపును కూడా ఇస్తాయి. నాలుగు స్పూన్ల క్యారెట్ గుజ్జులో రెండు స్పూన్ల  బొప్పాయి గుజ్జూ, కొద్దిగా పాలూ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట సేపటి తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు మిళమిళ మెరిసే ముఖ సౌందర్యం మీ సొంతం.
 
అదే విధంగా క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో సగం అరటి పండు గుజ్జూ, గుడ్డులోని తెల్లసొనా, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం మీద మూడతలు మాయమవుతాయి.
 
ఇంకా ఒక టీస్పూన్ క్యారెట్ సరసంలో ఒక టీస్పూన్ తేనెను కలిపి ముఖానికి రాసి పావుగంట తరువాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం తాజాగా మారుతుంది. అదే విధంగా ముఖంపై మొటిమలు ఉన్న వారు రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్కా వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు మాయమవడమే కాక ముఖ తేజస్సు మెరుగుపడుతుంది.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

పెట్రోల్ బంకులో పేలిన లారీ ఆయిల్ ట్యాంక్, అందరూ పారిపోయారు కానీ ఒక్కడు మాత్రం - video

200 మంది విటులకు హెచ్.ఐ.వి రోగాన్ని అంటించిన వ్యభిచారిణి.. ఎక్కడ?

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

Show comments