కళ్ల కింద నల్లని చారలు ఏర్పడి చర్మం సాగినట్లు అనిపిస్తే...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (20:41 IST)
మన చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితేనే మన అందం రెట్టింపవుతుంది. రకరకాల క్రీంలు, లోషన్లు రాయడం వల్ల చర్మం పాడవుతుంది. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మన చర్మ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి చిట్కాలేమిటో చూద్దాం.
 
1. చర్మంపై మృత కణాలు పేరుకున్నప్పుడు ముఖం అంద విహీనంగా తయారవుతుంది. అలాంటప్పుడు పావుకప్పు బొప్పాయి గుజ్జుకు కాస్త పెరుగు, పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరిగి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మృత కణాలు తొలగిపోతాయి.
 
2. చర్మానికి తగిన మొత్తంలో విటమిన్ ఇ అందితే చర్మం అందంగా ఉంటుంది. దీనికి రెండు పెద్ద చెంచాల విటమిన్ ఇ నూనెలో, నాలుగు చుక్కల తేనె అరచెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి తేమ అంది నిగనిగలాడుతుంది.
 
3. కళ్ల కింద నల్లని చారలు ఏర్పడి చర్మం సాగినట్లు అనిపిస్తే కోడిగుడ్డులోని తెల్లసొన రాసి పది నిమిషముల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా మారడంతో పాటు కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్ణాటక మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రుతుక్రమ సెలవు.. 12 రోజులు వేతనంతో పాటు?

మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఏమైంది?

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం.. ఎమ్మెల్యేలకు పీకే సూచన

జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.. ఆ తేడా కూడా తెలియదా? జబర్దస్త్ శాంతి స్వరూప్ (video)

మహా పాపం నిజం.. తిరుపతి లడ్డూ వివాదం.. వైకాపా, జగనే టార్గెట్‌గా ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

తర్వాతి కథనం
Show comments