బెల్లంతో ఫేస్ ప్యాక్... వేసుకుంటే ఎలా వుంటుంది..?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (11:43 IST)
బెల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. అందానికి కూడా అంతే మేలు చేస్తుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని మినరల్స్, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు చర్మ సంరక్షణకు చాలా ఉపయోగపడుతాయి. బయట దొరికే ఫేస్‌ప్యాక్స్, క్రీమ్స్ కంటే బెల్లం అందానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరి దీనితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
బెల్లం ఫేస్‌ప్యాక్:
బెల్లాన్ని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కొబ్బరినూనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై 5 నిమిషాలు ముఖాన్ని మర్దన చేసుకోవాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
 
పావుకప్పు బెల్లంలో కొద్దిగా పెరుగు, ముల్తానీ మట్టి కలిపి జుట్టుకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు చివర్ల చిల్లకుండా ఉంటుంది. అంతేకాదు.. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. అలానే బెల్లాన్ని మాత్రం మెత్తగా దంచి అందులో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌ చేసి మెుటిమలున్న ప్రాంతాల్లో రాసుకుంటే.. మెుటిమ సమస్యపోతుంది.
 
బెల్లాన్ని పాకంలా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర, కీరదోస రసం, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు క్రమంగా చేస్తే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోయి... ముఖం కోమలంగా తయారవుతుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

కళ్యాణ్ బాబు ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు : చిరంజీవి

ప్రేమించిన యువతికి వివాహం : తీవ్ర మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments