నెయ్యికి బాదం పలుకులు కలిపి వేడిచేసి..?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:23 IST)
జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీ నిపుణులు. నెయ్యిని ఓ బౌల్‌లో తీసుకుని దాన్ని జుట్టు చివర్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వేసుకుని.. ఆపై మైల్డ్ షాంపూతో కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే చుండ్రుకు చెక్ పెట్టడంలోనూ నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది. 
 
గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని 20 నిమిషాల పాటు వుంచాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం వుంటుంది.
 
అలాగే నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. మూడు చెంచాల నెయ్యిని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వెంట్రులకు రాసుకుని అరగంట పాటు వుంచి.. ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి. బట్టతల నుంచి తప్పించుకోవాలంటే.. మాసానికి ఓసారి నెయ్యిని కురులకు పట్టించడం చేయాలి. 
 
ఐదు స్పూన్ల నెయ్యికి పది బాదం పలుకులు కలిపి వేడి చేసి అవి నలుపుగా మారాక వాటిని నెయ్యి నుంచి తొలగించాలి. ఆ నూనెను మాడుకు పట్టించాలి. మూడు గంటలకు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మైల్డ్ షాంపును ఉపయోగించడం మరువకూడదు. ఇలా చేస్తే బట్టతల సమస్యను దూరం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : కింగ్ మేకర్‌ను కాదు కింగ్‌నే : హీరో విజయ్

Dog owner negligence: టెక్కీపై పెంపుడు కుక్క దాడి.. మెడను పట్టేసింది.. 50 కుట్లు పడ్డాయి (video)

అనారోగ్యంతో కొడుకును చూసేందుకు వస్తూ చలికి వృద్ధురాలు మృతి

బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుంది.. అందుకే అతనికి పదవి ఇచ్చా : డోనాల్డ్ ట్రంప్

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల కలకలం - రూ.6 లక్షల దోపిడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

తర్వాతి కథనం
Show comments