బాదంపప్పు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే?

మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు సమృద్ధిగా వుంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (16:13 IST)
మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు సమృద్ధిగా వుంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. దాంతో ముఖం కళకళలాడిపోతుంది.

శిరోజాలకు బాదం నూనె రాయడం వల్ల మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమృద్ధిగా వున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
మూడు టేబుల్ టీ స్పూన్ల పెరుగులో కొన్ని ఆక్రోట్లు వేసి మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి. ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు రానీయకుండా నివారిస్తుంది. జీడిపప్పులు మితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. రోజుకు కొన్ని తినడం ద్వారా బరువు తగ్గవచ్చు.
 
పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు మెరిసేలా చేస్తుంది. కాలి పగుళ్లను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్-ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి జీడిపప్పు ఉపశమనం కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్ 2026 విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్

దక్షిణాదిలో పెరిగిపోతున్న వితంతువులు.. ఎందుకని?

గోవా స్టైల్‌లో ఏపీలో షాక్స్ బీచ్..

కర్నాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే ఆర్థిక శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ లాంఛ్

సోల్ ఆఫ్ లెనిన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన- జూన్ 26న మనోడు వస్తున్నాడు

లింగ భైరవి దేవి పుణ్య పూజను నిర్వహించిన తమన్నా భాటియా

లుంగీలో పవన్ కళ్యాణ్.. ఇంటర్నెట్‌ను ఆకట్టుకుంటున్న ఫోటో

పవన్‌ను దొర అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు - కర్రుకాల్చి వాత పెట్టిన నటి హేమ (Video)

తర్వాతి కథనం
Show comments