Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేకింగ్ సోడాను వెంట్రుకలకు రాసుకుంటే?

జుట్టు రాలడం అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో బట్టతల వస్తుందేమోననే కంగారుతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యలకు మార్కెట్‌లో దొరుకుతున్న షాంపూలను, క్రీములను వాడుతుంటారు. ఇలాంటి వాటితో ప

Webdunia
బుధవారం, 25 జులై 2018 (12:47 IST)
జుట్టు రాలడం అనే సమస్య చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో బట్టతల వస్తుందేమోననే కంగారుతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యలకు మార్కెట్‌లో దొరుకుతున్న షాంపూలను, క్రీములను వాడుతుంటారు. ఇలాంటి వాటితో పనిలేకుండా ఇంట్లోనే సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవచ్చును.
 
కుంకుడు కాయలను నలగ్గొట్టి వాటిలోపలి గింజలను తీసేసి వేడి నీటిలో కాసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని పిండి రసం తీసి ఆ మిశ్రమంలో తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. శీకాయలను మెత్తగా పిండిలా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
కలబంద గుజ్జును జుట్టుకు రుద్దుకోవాలి. కాసేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చరచుగా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. అలానే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉసిరికాయను పేస్ట్‌లా చేసుకుని అందులో రోజ్‌వాటర్‌ను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. దీంతో జుట్టుకు మంచి కాంతితో పాటు వాసన కూడా లభిస్తుంది.
 
3 స్పూన్స్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లను పోసి తలకు పట్టించాలి. కాసేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వలన తప్పక మంచి ఫలితాలను పొందవచ్చును. కొద్దిగా శెనగపిండిలో పాలను కలుపుకుని తలకు రాసుకోవాలి. కాసేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments