కలబంద ఆకులను కొద్ది నీళ్లల్లో మరిగించి..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (10:58 IST)
కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. కలబందను ఆహార పదార్థాల్లో, శీతల పానీయాలలో కూడా వాడుతారు. వైద్యపరంగా కూడా దీనికెంతో ప్రాధాన్యత ఉంది. అందానికైతే ఇక చెప్పనక్కర్లేదు. చర్మ సమస్యలతో బాధపడేవారికి కలబంద ఫేస్‌ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. మరి ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం...
 
2 స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు, దోసకాయ రసం, రోజ్ వాటర్ వేసి బాగా పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని ఓ 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కుని మెత్తని బట్టతో తుడుచుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
కలబంద ఆకులను కొద్ది నీళ్లల్లో మరిగించుకోవాలి. ఆపై అందులో తేనె కలిపి.. పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పూసుకుని అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేసినా జిడ్డుగా పోతుంది.
 
2 స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా జున్ను, దోసకాయ ముక్కలు. నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖచర్మానికి రాసుకుని 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ముఖం మృదువుగా మారుతుంది. దాంతో పాటు నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: డిసెంబర్ 29 నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

Andhra: బాబు పాలనలో ఏపీ మహిళలకు అభత్రామయంగా మారింది.. కాకాని పూజిత

మీ భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలి: జెన్ Z వ్లాగర్ స్వాతితో డిప్యూటీ సీఎం పవన్

జనవరి 8 నుంచి అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్: ఆమ్రపాలి ఐఏఎస్

మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, నిందితుల్లో తండ్రీకొడుకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Eesha Rebba: సూపర్ హిట్ వెబ్ సిరీస్ 4 మోర్ షాట్స్ ప్లీజ్ అంటున్న సీజన్ 2

మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన డార్క్ కామెడీ మూవీ గుర్రం పాపిరెడ్డి

Anil Ravipudi: శంబాల బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న ప్రముఖులు

చిట్టి పికిల్ రమ్య మంచి బాడీ బిల్డర్, బిగ్ బాస్ ట్రోఫీ గెలవాల్సింది: దువ్వాడ శ్రీనివాసరావు

Vijay Deverakonda: రాక్షసుడిని అంతమెందించే రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments