Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీ, పురుషులు ఎవరికైనా ఈ 6 సూత్రాలు... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (16:51 IST)
ఇప్పుడు అందానికి స్త్రీలే కాదు పురుషులు కూడా అమితమైన ప్రాధాన్యతనిస్తున్నారు. ఆకర్షణీయమైన ముఖం కోసం నానా తంటాలు పడుతున్నారు. అలాంటివారు ఈ క్రింది ఆరు సూత్రాలు పాటిస్తే ఆకర్షణీయమైన ముఖం మీ సొంతం. అవేంటో చూడండి.
 
1. మీ ముఖం డల్‌గా కాంతి హీనంగా ఉందా? చిన్నచిన్న చిట్కాలతో మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చండి. మీ చేతి వ్రేళ్లతో మీ చర్మానికి జీవకళ తీసుకురావచ్చు, కంటిపై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతి వ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి.
 
2. పైన చెప్పిన విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్‌ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి, ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది.
 
3. మీకు ముడతలు లేని చర్మం కావాలంటే..
మీరు నిద్రించేప్పుడు ముఖం వైపు పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు మరియు బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి.
 
4. ముఖానికి మసాజ్ ఎంతో  మేలు  
దీనికోసం మీరు మసాజ్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు, ప్రతీ రాత్రి మీకు నచ్చిన మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు.  
 
5. ఆహార అలవాట్లపై దృష్టి ఉంచండి.
పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరచుగా చేపలతో కూడిన ఆహరం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.
  
6. సన్ స్క్రీన్‌లు వాడటం మంచిది
కుడి చేయివాటం ఉన్న వారు ఎక్కువగా సన్‌స్క్రీన్‌ లను ఎడమ వైపు పెడుతారని, ఎడమ చేయివాటం వారు కుడి వైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండు వైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండు వైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments