Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైహీల్స్‌తో అనారోగ్యం తప్పదు...

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (19:10 IST)
ఓ పాప తన అమ్మను అడుగుతోంది.. అమ్మా అమ్మా వేసుకుంటే పడిపోతామే.. ఆ చెప్పులు తీసి పెట్టవూ... అని.. చిన్నవయసులో పేరు తిరగక ఆ పాప చెప్పిన చెప్పుల విశేషం ఏమిటో మనకు తెలుసు. హైహీల్స్ అనబడే ఎత్తుమడమల చెప్పులు... పాపం ఆ పాపకు పదం తిరగకపోయి ఉండవచ్చు కాని ఆ చెప్పుల గుణాన్ని మాత్రం మనసులో బాగా పట్టేసుకుంది. వేసుకుంటే పడేసే చెప్పులు... సాదా సీదాగా పడేయటం కాదు.. మహిళల జీవితాన్నే ఈ ఎత్తుమడమల చెప్పులు పడేస్తున్నాయని లండన్‌లో ఒక పరిశోధన చెబుతోంది మరి. తస్మాత్ జాగ్రత్త.

విదేశాల్లో లాగా భారత్‌లో ఎత్తుమడమల చెప్పులు అంతగా ఫ్యాషన్ అయినట్లు లేదు. మోడల్స్, సెలెబ్రిటీస్, సినిమా తారలు వంటి వారు తప్ప సగటు ఆధునిక యువతులు వీటికి ఇంకా పూర్తిగా అలవడలేదు. ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు మరీ పొట్టిగా ఉండటం నామోషీ అనిపించిన సందర్భాల్లో ఈ ఎత్తుమడమల చెప్పులు వేసుకుంటున్నారు.

అయితే బ్రిటన్‌లో ఎత్తుమడమల చెప్పులు మహిళల సాధారణ చెప్పుల్లా తయారయ్యాయట. దీనివల్ల వస్తున్న విపరిణామాలు తీవ్రాతితీవ్రంగా ఉన్నాయని ఇటీవలి ఓ పరిశోధన తెలిపింది. హైహీల్స్ కొనుగోళ్ల కోసం మహిళలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే వాటి దుష్ఫలితాలను పోగొట్టుకోవడానికి చేస్తున్న మొత్తం ఊహించనంత భారీగా ఉంటోంది. బ్రిటన్ మహిళలు ఎత్తుమడమల చెప్పుల వాడకంతో వస్తున్న వ్యాధులను పోగొట్టుకునేందుకు ఏటా 29 మిలియన్ పౌండ్లను మెడికల్ బిల్లుల కింద చెల్లిస్తున్నారని ఎంబిటి షూ బ్రాండ్ అధ్యయనం చెబుతోంది.

హైహీల్స్ వాడకం వల్ల కాలిమడమలు అరిగిపోవడం, నరాలు తొలగిపోవడం, పాదాలు దెబ్బతినడం వంటి వ్యాధులకు మహిళలు గురవుతున్నారు. జాతీయ ఆరోగ్య సేవ ద్వారా ఈ వ్యాధులకు చికిత్స చేయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి రోగులకు ప్రైవేట్ క్లినిక్‌లు తప్పనిసరి అయి ఖర్చు పెరిగిపోతోంది. ఇలా ఒక్కొక్క పేషెంటుకు ప్రైవేట్ క్లినిక్‌లలో హైహీల్స్ దుష్పరిణామాలపై చికిత్స చేయాలంటే 1200 పౌండ్లు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ప్రైవేట్ ట్రీట్‌మెంట్‌కు బ్రిటన్‌లో ఏటా 10.4 మిలియన్ పౌండ్ల ఖర్చు అవుతోందట.

ఎత్తుమడమల చెప్పులు వాడి పాదాలు అరిగిపోయిన ఘటనలతో కాస్మెటిక్ సర్జరీ చేసుకోవడం కూడా బ్రిటన్ సమాజంలో బాగా పెరిగిపోయింది. 15 ఏళ్లు ఆ పైబడిన వెయ్యి మంది యువతులపై మాంచెస్టర్, లివర్ పూల్ నగరాల్లో పరీక్షలు జరుపగా వారిలో దాదాపు ప్రతి ఒక్కరూ కాలి గాయాలు వ్యాధుల బారిన పడినవారేనని ఈ అధ్యయనం తెలిపింది. వారంలో అయిదు రోజులు లేదా వారం పొడవునా తాను హైహీల్స్ వాడుతున్నామని వాయవ్య బ్రిటన్‌లోని మహిళలలో సగంమంది చెప్పారు.

అలవాటు పడిన ప్రాణాలు కాబట్టి హైహీల్స్ వాడకం నిషేధించమంటే కుదరదు కాబట్టి ఇకనైనా వాటిని వాడే రోజులను, సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని బ్రిటిష్ కాలి వైద్య నిపుణురాలు ఎమ్మా సపెల్ చెబుతున్నారు. దీనిద్వారా భవిష్యత్తులో మరింత ప్రమాదం జరగకుండా, కాలిగాయాలు తగులకుండా నరాలు చిట్లకుండా జాగ్రత్తపడవచ్చని అంటారీమె.

కాబట్టి హైహీల్స్ అనబడే ఎత్తుమడమల చెప్పులకు మహిళలు ఎంతదూరంగా ఉంటే మంచిదని వైద్యుల ఉవాచ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments