Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చర్మ సంరక్షణకు ఈ టిప్స్ పాటించండి!

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2014 (16:12 IST)
FILE
వేసవి కాలం వచ్చేస్తుంది. మీ చర్మ సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. వేసవిలో స్కిన్ కేర్ చాలా అవసరమని బ్యూటీషన్లు అంటున్నారు. ఏ సీజన్లోనైనా సూర్యుని అతినీలలోహిత కిరణాలు తాకిడికి చర్మం కమిలిపోయే అవకాశం ఉంది.

చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి గుండ్రంగా మృదువుగా మసాజ్ చేసుకోవాలి.

ఒక స్పూన్ బంగాళా దుంప రసం, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి రాసి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తగ్గేవరకూ రోజూ ఇలా చేస్తూనే ఉండాలి.

కీరా రసం తీసి, ఒక టేబుల్ స్పూన్ చల్లని పాలలో కలిపి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి.

మూడు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి రాసి, కొద్దిసేపాగి కడిగి వేయాలి.

కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్టు మాదిరి చేసి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది.

ఆలివ్ ఆయిల్ మసాజ్ వల్ల ఫలితం కనిపిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక నిమ్మకాయరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి.

నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జుగా చేసుకుని దానిని రాసుకుని 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments