Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఆలివ్ చేసే మేలు..!!

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2012 (10:47 IST)
FILE
తాజా చర్మం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మేని సౌందర్యాన్ని పొందాలంటే ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటున్నారు నిపుణులు.

* పొడిబారిన చర్మతత్వం ఉన్నవారు ప్యాక్ వేసుకుంటుంటే దాని తాయారీలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెను వేస్తే చర్మం ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తుంది.

* టేబుల్ స్పూను తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల ఆలివ్‌నూనె కలిపి ముఖం, మెడ భాగానికి రాసుకొని, పదిహేను నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగితే ముఖం మృదువుగా మారుతుంది.

* గోళ్లు ఆరోగ్యంగా మారాలంటే కప్పు ఆలివ్‌నూనెను తీసుకుని అందులో వేళ్లు మునిగేలా ఉంచండి. మరకలు పడిన గోళ్లు, వేళ్లకు మాత్రం అలివ్‌నూనెలో కొన్నిచుక్కల నిమ్మరసం కూడా కలపాలి. ఆ నూనెతో ప్రతిరోజూ మర్దన చేసుకున్నా కూడా సరిపోతుంది.

* కొద్దిగా నూనెను తీసుకుని తలకు రాసుకోవాలి. మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేయాలి. ఆ తరువాత మరికాస్త నూనెను జుట్టు చివర్లకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జీవం ఉట్టిపడుతూ ఒత్తైన కురులు మీ సొంతమవుతుంది.

* రెండు కోడిగుడ్ల పచ్చసొనను తీసుకుని బాగా గిలక్కొట్టాలి. అందులో రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకొని అరగంటయ్యాక కడిగేసుకుంటే జుట్టుకు పోషణ అంది, జుట్టు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మారుతుంది.

* స్నానం చేసే నీటిలో రెండు చెంచాల ఆలివ్‌నూనెను వేసుకున్నా కూడా చర్మం పరిమళభరితం కావడమే కాదు, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

* వేసవికాలం అంటే చాలు పెదవులు పొడిబారే సమస్య తప్పదు. దీన్ని నివారించాలంటే, లిప్‌బామ్‌కు బదులుగా ఈసారి ఆలివ్‌నూనెను రాసి చూడండి. ఎక్కువ సమయం తాజాదనంతో పాటు పెదవులపై ఉండే మృతచర్మమూ తొలగి పెదవుల్లో గులాబీలు విరబూస్తాయి.

* కళ్ల చివరన ముడతలు కనిపిస్తుంటే చెంచా ఆలివ్‌నూనెలో విటమిన్ ఇ నూనె కలిపి సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచేయాలి. ఇలా తరచూ చేస్తుంటే, ముడతలు అంతగా కనిపించవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

Show comments