Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్యప్రాణులకు నిలయం రాజస్థాన్‌

Webdunia
ఆదివారం, 3 జూన్ 2007 (18:04 IST)
రాజస్థాన్‌లో ఎడారి మాత్రమే కాకుండా వన్యప్రాణులతో నిండిన దట్టమైన అడవులు కూడా వున్నాయి. ఇక్కడి `సరిస్కా నేషనల్‌ పార్కు'లో రకరకాల వన్యప్రాణులు వున్నాయి. ఆరావళీ పర్వత శ్రేణులలోని అడవులలో వున్న ఈ పార్కుతో పాటు టైగర్‌ రిజర్వు కూడా రాజస్థాన్‌లో వుంది.

ఈ పార్కులో తోడేళ్ళు, అడవి పిల్లులు, చిరుత పులులు, ముళ్ళపందులు, ఇతర జంతువులు వున్నాయి. 1979లో ఈ పార్కును ప్రాజెక్‌‌ట టైగర్‌లో భాగంగా టైగర్‌ రిజర్వుగా చేశారు. ఈ పార్కు జైపూర్‌కు 110 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ పార్కు 800 చదరపు అడుగుల వరకు వ్యాపించి వుంది. ఇందులో చారిత్రాత్మక `కనక్‌వాడి' కోట వుంది.

ఇందులో ఔరంగజేబు తన సోదరుడిని బందీగా వుంచాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆళ్వార్‌ మహారాజులు నిర్మించిన ఓ రాజమహల్‌ను ప్రస్తుతం ఓ హోటల్‌గా మార్చారు. పర్యాటకులకు ఇది వసతిగృహంగా ఉపయోగ పడుతోంది.

సందర్శనకు అనువైన కాలం :
సంవత్సరమంతా పర్యాటకులు ఇక్కడికి వచ్చినా జులై, ఆగస్టులలో పశుపక్ష్యాదులు ఎత్తయిన ప్రాంతాలకు వెళతాయి. ఏప్రిల్‌, మేలలో వేడి ఎక్కువగా వుంటుంది. కాని, పర్యాటకులకు ఇది అనువైనకాలం - ఎందుకంటే పశుపక్ష్యాదులు దాహం తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. నవంబర్‌ కూడా సందర్శకులకు అనువైనదే.

ఎక్కడ బసచేయవచ్చు :
ఫారెస్‌‌ట రెస్‌‌టహౌస్‌, టైగర్‌ డెన్‌, టూరిస్టు బంగళా, హోటల్‌ లేక్‌ ప్యాలెస్‌, హోటల్‌ సరిస్కా ప్యాలెస్‌లో పర్యాటకులు తమ బసను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి :
సరిస్కా ఢిల్లీ-ఆళ్వార్‌-జైపూర్‌ మార్గంలో వుంది. ఆళ్వార్‌కు జైపూర్‌ 110 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ 200 కిలోమీటర్ల దూరంలో వుంది. జైపూర్‌ సమీపంలో విమానాశ్రయం కూడా వుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments