Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరా అనిపించే... "ఉదకమండల" అందాలు

Webdunia
పచ్చని ప్రకృతి, చల్లటి వాతావరణంలో మండువేసవిని ఆహ్లాదంగా గడిపేందుకు అనువైన చక్కటి ప్రదేశమే "ఉదక మండలం". కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో కొలువైన ఈ శీతల ప్రదేశాన్నే... వాడుకభాషలో అందరూ "ఊటీ" అని సంబోధిస్తుంటారు. హైదరాబాదు నుంచి 842 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊటీని సందర్శించేందుకు జనవరి-మే అలాగే సెప్టెంబర్-అక్టోబర్ నెలల మధ్యకాలం అనువుగా ఉంటుంది.

ఈ ఊటిలో చూడదగిన ప్రదేశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొటానికల్ గార్డెన్స్. దొడబెట్ట శ్రేణులలో 50 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికతో విస్తరించిన బొటానికల్ గార్డెన్స్ సందర్శకులను విశేషంగా అలరిస్తుంది. వేల రకాల మొక్కలు, పుష్పాలతో కవ్వించే ఈ గార్డెన్స్‌లో ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే "ప్లవర్ షో"ను తప్పకుండా చూసి తీరాల్సిందే..!

అలాగే... బోటింగ్ లాంటి జలక్రీడా విన్యాసాలకు చెప్పుకోదగ్గది ఊటీ సరస్సు. ఇది బ్రిటీష్ వారి కాలంలో 18వ శతాబ్దంలో నిర్మించినది కాగా... ఇది ఊటీకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఊటీకి 10 కిలోమీటర్ల దూరంలో నీలగిరి కొండల్లో ఉండే సుందరమైన పర్వతశ్రేణి "దొడబెట్ట" కూడా చూడదగ్గ ప్రాంతమే.

ఊటీకి 13 కిలోమీటర్ల దూరంలో ఉండే "కూనూర్" చర్చ్‌లకు, బోర్డింగ్ స్కూల్స్‌కు పెట్టింది పేరు. కూనూర్‌కు 12 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద ఏకశిల డాల్ఫినోస్‌లాగా ఏర్పడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే, డ్యూక్ ఆఫ్ బకింగ్ హామ్ నిర్మించిన రాజ్‌భవన్, పలువురు మహారాజులు నిర్మించిన రాజప్రాసాదాలు, సెయింట్ స్టీఫెన్ చర్చి, తూర్పు జెరూసలేంగా ప్రసిద్ధిచెందిన కందాల్ క్రాస్, రోజ్ గార్డెన్స్, జింకల పార్కు... తదితర ప్రాంతాలు ఇంకా చూడదగ్గ ప్రదేశాలు.

సముద్ర మట్టానికి 2,286 మీటర్ల ఎత్తులో ఉన్నందున ఊటీ ప్రాంతం చల్లగా ఉంటుంది. 36 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కాగా... కనిష్టంగా 10 డిగ్రీలుగా నమోదవుతుంటుంది. అదే చలికాలంలో అయితే కనిష్ట ఉష్ణోగ్రత కేవలం 5 డిగ్రీలకు పడిపోతుంటుంది. సగటు వర్షపాతం 121 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఇక్కడి ప్రజానీకం తమిళం, మళయాళం, కన్నడం, ఇంగ్లీష్ బాషల్లో మాట్లాడుతారు.

చేరుకోవడం ఎలా..? ఊటీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే కోయంబత్తూర్ విమానంలో చేరుకోవచ్చు. అక్కడినుంచి రైల్లో వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి అయితే రైల్లో వెళ్ళవచ్చు. అదే రోడ్డు ప్రయాణం అయితే, చెన్నై నుంచి సేలం, మేట్టుపాలయం మీదుగా 535 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

అదే కోయంబత్తూరు నుంచయితే, 89 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఊటీ చేరుకున్నట్లే..! ఇకపోతే... తిరుపతి, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, కన్యాకుమారి, మైసూరు, పాలఘాట్, కాలికట్ ప్రాంతాల నుంచి ఊటీకి బస్సు సర్వీసులు రెగ్యులర్‌గా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే ఊటీకి ప్రయాణమవుతారు కదూ...!!

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments