Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పీపీఈ కిట్ ధరించి రూ. 13 కోట్ల విలువైన బంగారం చోరీ - ప్రెస్‌ రివ్యూ

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:59 IST)
దేశ రాజధాని దిల్లీలో పీపీఈ కిట్‌ను ధరించిన ఓ వ్యక్తి బంగారం షాపులో చొరబడి రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. కరోనాపై పోరులో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరిస్తారు. అయితే ఈ కిట్‌ను చోరకళలోనూ వాడేందుకు ప్రయత్నించాడో దొంగ.
 
తానెవరో గుర్తించకుండా ఉండేందుకు పీపీఈ కిట్‌ ధరించి ఓ జువెలరీ షొరూంలోకి చొరబడ్డాడు. దాదాపు 25 కిలోల బంగారు నగలను తస్కరించి ఉడాయించాడు. కర్ణాటకలోని హూబ్లీకి చెందిన మహ్మద్‌ షేక్‌, దక్షిణ దిల్లీలోని కల్కాజీ ఏరియాలో మంగళవారం రాత్రి 9:30 గంటలకు సమీపంలో ఓ భవనం టెర్రెస్‌పై నుంచి దూకి జువెలరీ షోరూంలోకి ప్రవేశించాడు. అక్కడ వివిధ అరల్లో అమర్చిన నగలను సంచీలో వేసుకుంటూ తెల్లవారుజామున 3 గంటల దాకా షోరూంలోనే ఉన్నాడు.
 
తర్వాత నగల సంచీతో బయటకొచ్చి ఓ ఆటోలో వెళ్లిపోయాడు. ఇంత జాగ్రత్తగా దొంగతనం చేసినా అతడి ప్రయత్నం వృధానే అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments