సెక్స్ టేప్‌ల కేసు: 'నాలుగు నెలల కిందటే ఆ సీడీల సంగతి నాకు తెలుసు, అదంతా కుట్ర'

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (18:25 IST)
ఓ యువతితో తాను పడకపై ఉన్నట్లు విడుదల చేసిన దృశ్యాలు ఫేక్ అని కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. అదంతా తనపై కుట్ర అని ఆయన అన్నారు. నాలుగు నెలల కిందటే ఆ సీడీల విషయం తన దృష్టికి వచ్చిందని.. దాన్ని వారు మీడియాకు విడుదల చేయడానికి 24 గంటల ముందు కూడా తనకు తెలుసని రమేశ్ చెప్పారంటూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

 
ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఇదంతా చేశారని.. ప్రస్తుతం తాను ఇంతకుమించి ఏమీ చెప్పబోనని ఆయన అన్నారు. అయితే, వారిని జైలుకి పంపించేవరకు వదిలిపెట్టబోనని రమేశ్ అన్నారు. రాజకీయ నాయకులపై జరిగే ఇలాంటి కుట్రలు, బ్లాక్ మెయిళ్లను అరికట్టేలా చట్టం ఉండాలని రమేశ్ అభిప్రాయపడ్డారు.

 
తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో రాకుండా చూడాలంటూ ఆరుగురు మంత్రులు కోర్టుకు వెళ్లడాన్ని తాను మద్దతిస్తున్నానని ఆయన అన్నారు. హెచ్‌డీ కుమారస్వామిని, ఆయన కుటుంబాన్ని తానేమీ నిందించబోనని.. తనకు సంబంధించిందంటూ సీడీ విడుదలైన తరువాత హెచ్‌డీ రేవన్న, కుమారస్వామి ఇద్దరూ తనతో మాట్లాడారాని రమేశ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం