సైనా నెహ్వాల్: భారతీయ జనతా పార్టీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (13:32 IST)
ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె సోదరి సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సైనా నెహ్వాల్, ఆమె అక్క చంద్రాన్షు నెహ్వాల్‌లకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, కాషాయ కండువా కప్పారు.

 
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. దేశం కోసం కష్టపడుతున్న పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీలో చేరటం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. తాను కష్టపడే స్వభవం గల వ్యక్తినని, కష్టపడేవాళ్లంటే తనకు ఇష్టమని.. నరేంద్ర మోదీ దేశం కోసం రాత్రి, పగలు కష్టపడుతుంటారని, ఆయనతో పాటుగా తాను కూడా దేశం కోసం కష్టపడతానని తెలిపారు.

 
తనకు రాజకీయం కొత్త అని, అయితే.. రాజకీయాలపైన కూడా అవగాహన తెచ్చుకోవడం, రాజకీయాలను పరిశీలించడం తనకు నచ్చుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !

వేణు ఉడుగుల ఆవిష్కరించిన సింగిల్ రాజు టైటిల్, గ్లింప్స్

తర్వాతి కథనం
Show comments