Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: కోవిడ్ రోగి నిర్లక్ష్యం... శిబిరంలో రక్తదానం - ప్రెస్ రివ్యూ

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:15 IST)
తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఒక కరోనా రోగి రక్తదానం చేశాడని ఈనాడు వార్తా కథనం ప్రచురించింది. కోవిడ్‌ బారినపడిన వ్యక్తి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండాల్సిందిపోయి జనాల్లోకొచ్చాడు. పైపెచ్చు రక్తదానం చేశాడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందర్నీ ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని ఇరక్‌పల్లికి చెందిన వ్యక్తి మూడు రోజుల క్రితం మండల కేంద్రం మనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు.
 
పాజిటివ్‌గా నిర్ధారణవడంతో అక్కడి వైద్యుడు మురళీకృష్ణ మందులు ఇచ్చి, ఇంట్లో క్వారంటెయిన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని నాగల్‌గిద్దలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వైద్యుడు పర్యవేక్షించారు. ఈ క్రమంలో కొవిడ్‌ రోగి రక్తదానం చేస్తుండగా గుర్తించి అవాక్కయ్యారు. 'ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన నువ్వు రక్తదానం చేయడమేంటని' నిలదీయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.
 
దీంతో సేకరించిన 15 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులు బయటపడేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఈనాడు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments