Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-2 : 2022లో చంద్రుడిపైకి ఇండియన్.. అక్కడే ఇస్రో ఎందుకు అడుగుపెడుతోంది?

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (22:55 IST)
ఇస్రో పంపిన చంద్రయాన్ 2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇవాళ అర్ధరాత్రి (సెప్టెంబర్ 7, 2019) 1.55 నిమిషాలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతోంది. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం దగ్గరే ఎందుకు దిగుతోంది? ఈ ప్రశ్న చాలామందికే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ దిగడం క్లిష్టమైన ప్రక్రియ అని భావిస్తున్నప్పుడు చంద్రుడిపై పరిశోధనకు ఆ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?

 

ఇటీవల చేపట్టిన కొన్ని ఆర్బిటింగ్ మిషన్ల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. నీరు లభించే అవకాశముండటంతో చందమామ దక్షిణ ధృవం భవిష్యత్‌లో మానవ మనుగడకు అనువైన ప్రాంతం కావచ్చని శాస్త్రవేత్తల ఆలోచన.

చంద్రుడి ఉపరితల పొరలో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్‌, సోడియం, మెర్క్యూరీ, వెండి లాంటి మూలకాల ఆనవాళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. సౌరవ్యవస్థలోని ఐట్కెన్ బేసిన్ అంచుల్లో చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం ఉంది. ఇక్కడి ఉపరితలభాగమంతా చంద్రుడి పైభాగం (క్రస్ట్), ఉపరితలం నుంచి లోపలి భాగం (మ్యాంటిల్)లో లభ్యమయ్యే పదార్థాలతో నిండి ఉంటుంది.

 
ఈ పదార్థాలపై పరిశోధనలు నిర్వహిస్తే... అసలు చంద్రమామ ఎలా ఏర్పడిందో, భవిష్యత్‌ మిషన్లకు ఇది ఓ వనరుగా ఉపయోగపడేందుకు అవకాశం ఉందో లేదో వంటి విషయాలన్నీ స్పష్టమయ్యే అవకాశం ఉంది.

 
రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్
ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో మూడు భాగాలుంటాయి. ఒక ఆర్బిటాల్, ఒక ల్యాండర్ (దీనికి భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆద్యుడుగా భావించే డాక్టర్ విక్రమ్ సారాభాయ్‌కి గుర్తుగా విక్రమ్ అని పేరు పెట్టారు). ఆరు చక్రాలున్న రోవర్ (దీని పేరు ప్రజ్ఞాన్). వీటన్నింటినీ ఇస్రోనే రూపొందించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి అటూ ఇటూ తిరుగుతూ తన ప్రయోగాలను ప్రారంభిస్తుంది.

 
దక్షిణ ధృవ ప్రాంతంలోని మాంజినస్-సీ, సింపెలియస్-ఎన్ అనే రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో ఇవాళ అర్ధరాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడి ఉపరితలంపైన, లోపల ఒక రోజు (ఇది భూమిపై 14 రోజులకు సమానం) పాటు రోవర్ తన పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహిస్తుంది. ఆర్బిటార్ మిషన్ మరో సంవత్సరం పాటు కొనసాగుతుంది.

 
చంద్రయాన్ 2 ద్వారా అశోక చక్రం ముద్ర, ఇస్రో గుర్తులను చంద్రుడిపై లిఖించబోతోంది భారత్. "రోవర్‌ చక్రాలకు ఓ వైపు అశోక చక్రం, మరోవైపు ఇస్రో గుర్తు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై రోవర్ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఈ గుర్తులు అక్కడి నేలపై పడతాయి" అని ఇస్రో చైర్మన్ చెప్పారు. చంద్రయాన్ 2 అరుదైన క్షణాలను వీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
 
2022లో చంద్రుడిపైకి ఇండియన్
భారత్ చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం చంద్రయాన్-2. ఇంతకు ముందు రష్యా, అమెరికా, చైనా ఈ ప్రయోగాలు చేశాయి. నాలుగు టన్నుల బరువున్న ఈ అంతరిక్షయాత్రలో ఒక లూనార్ ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉన్నాయి. చంద్రుడిపై ప్రపంచవ్యాప్తంగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. చంద్రయాన్-2 తర్వాత భారత్ 2022లో చంద్రుడిపై వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.
 
"మేం చంద్రుడిపై ఉన్న బండరాళ్లను పరిశీలించి, వాటిలో మెగ్నీషియం, కాల్షియం, లోహాలు లాంటివి ఉన్నాయేమో అన్వేషించడానికి ప్రయత్నిస్తాం. దానితోపాటు అక్కడ నీళ్లున్నాయా అనే సంకేతాలు కూడా వెతుకుతాం. చంద్రుడి బయటి ఉపరితలాన్ని కూడా పరిశీలిస్తాం" అని ఇస్రో చెప్పింది.
 
చంద్రుడిపై అన్వేషణ
చంద్రయాన్-2లో భాగమైన ఆర్బిటర్, ల్యాండర్ భూమిని నేరుగా సంప్రదిస్తాయి. కానీ రోవర్ అలా చేయలేదు. ఇది పదేళ్లలో చంద్రుడిపైకి పంపించిన రెండో మిషన్. చంద్రయాన్-1 భారత మొట్టమొదటి మిషన్. ఇది దాదాపు ఏడాది(2008 అక్టోబర్ నుంచి 2009 సెప్టంబర్) పాటు నడిచింది. దీనిని కూడా 2008 అక్టోబర్‌లో షార్‌ నుంచే ప్రయోగించారు. ఇది 2008 నవంబర్ 8న చంద్రుడిపైకి వెళ్లింది. ఈ ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలో 312 రోజుల పాటు తిరిగింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ చంద్రయాన్ మిషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.
 
చంద్రయాన్-1 అన్వేషణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రయాన్-2ను పంపించారు. చంద్రయాన్-1 అన్వేషించిన నీటి అణువుల ఆధారాల తర్వాత చంద్రుడి ఉపరితలంపై, దాని దిగువన, బయటి వాతావరణంలో ఉన్న నీటి అణువుల పరిధిని ఇది పరిశోధించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మురారి ఫీలింగ్ వచ్చింది : అశోక్ గల్లా

పెళ్లి చూపులు టైంలో ఈ స్థాయికి వస్తామనుకోలేదు : విజయ్ దేవరకొండ

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments