Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారం ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (13:26 IST)
కరోనావైరస్ 145కి పైగా దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ తరుణంలో ఈ అంటువ్యాధి ఎంతగా వ్యాప్తి చెందుతుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? దీని బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు? వంటి ప్రశ్నలు చాలామంది ఆడుగుతున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి బీబీసీ న్యూస్ పాఠకులు అడిగిన కొన్ని ప్రశ్నలను, వాటికి వైద్య నిపుణులు ఇచ్చిన సమాధానాలను చూద్దాం

 
ఫేస్ మాస్క్‌లు ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేందుకు ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. పరిశుభ్రత పాటించాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నోటిని, ముఖాన్ని తాకేముందు చేతులను శుభ్రపరచుకుంటే ఈ వైరస్‌ వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని అంటున్నారు.

 
డోర్ హ్యాండిల్స్ ద్వారాకరోనావైరస్ వ్యాప్తి చెందుతుందా? ఈ వైరస్ ఎంతకాలం జీవించి ఉండగలదు? - జీన్ జిమెనెజ్, పనామా
వైరస్ సోకినవారు ఎవరైనా చేతులు అడ్డుపెట్టుకుని దగ్గుతూ, తర్వాత ఆ చేతులతో ఏదైనా వస్తువును తాకితే, ఆ వస్తువు ఉపరితలం కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలా వైరస్ అంటుకునే వాటిలో డోర్ హ్యాండిల్స్ ఉండవచ్చు.

 
వస్తువులపై కరోనావైరస్ కొన్ని రోజులపాటు జీవించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి, వైరస్ సంక్రమణ, వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు మీ చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవడం మంచిది.

 
సెక్స్ ద్వారాకరోనావైరస్ సంక్రమిస్తుందా? - డేవిడ్ చెయోంగ్, సింగపూర్
సెక్సు ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందా లేదా అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతానికి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు భావిస్తున్నారు. 

 
కరోనావైరస్, ఫ్లూ మధ్య తేడాలు ఏమిటి?- బ్రెంట్ స్టార్, గ్రేషామ్, ఒరెగాన్, అమెరికా
కరోనావైరస్, ఫ్లూ ఈ రెండింటిలోనూ చాలా వరకు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. పరీక్షలు చేయకుండా వీటిని నిర్ధరించడం కష్టం. జ్వరం, దగ్గు కరోనావైరస్ ప్రధాన లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్లూ వచ్చిన వారిలో గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. కరోనావైరస్ సోకినవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.

 
కరోనావైరస్... ఫ్లూ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే అంటువ్యాధా? - మెర్రీ ఫిట్జ్‌ప్యాట్రిక్, సిడ్నీ
ఇప్పుడే ఈ రెండింటిని పోల్చి చెప్పడం తొందరపాటు కావచ్చు. కానీ, ఈ రెండూ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్‌లేనని చెప్పొచ్చు.

 
కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి అది సగటున మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు అంటుకుంటుంది. ఫ్లూ విషయానికి వస్తే ఒక్కో రోగి సగటున ఒక్కొక్కరికి వైరస్‌ను చేరవేస్తారు. అయినా, ఫ్లూ ఒకరి నుంచి ఇంకొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి రెండు వైరస్‌లూ సులవుగా వ్యాప్తి చెందుతాయని చెప్పవచ్చు.

 
కరోనావైరస్ బాధితులు తయారుచేసిన ఆహారం ద్వారా ఆ వైరస్ ఇతరులకు సోకుతుందా? - సీన్ మెక్‌ఇంటైర్, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
కరోనావైరస్ బారిన పడినవారు తయారుచేసిన ఆహారం పరిశుభ్రంగా లేకపోతే, దానిని తీంటే ఇతరులకు కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉంది. రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు చేతులపై పడితే, ఆ చేతులతో ఆహారాన్ని తాకితే అది కలుషితం అవుతుంది. ఆహార పదార్థాలను తాకేముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 
ఈ శ్వాసకోశ సమస్య నివారణకు టీకాలు ఉన్నాయా? - హన్స్ ఫ్రెడరిక్
ప్రస్తుతానికి, ఈ రకమైన కరోనావైరస్ నుంచి ప్రజలను రక్షించే టీకా లేదు. కానీ, ప్రస్తుతం ఓ టీకాను అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇంతకుముందు మనుషుల్లో ఎప్పుడూ కనిపించని వైరస్. కాబట్టి, దీని గురించి వైద్య నిపుణులు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

 
కరోనావైరస్ వ్యాప్తిని వాతావరణం, ఉష్ణోగ్రతలు ప్రభావితం చేస్తాయా? - అరియానా, మార్కిష్- ఒడర్‌ల్యాండ్, జర్మనీ
కాలానుగుణంగా ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ఈ వైరస్ వ్యాప్తిని ప్రభావితం చేస్తాయా? అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. ఫ్లూ వంటి కొన్ని ఇతర వైరస్‌ల వ్యాప్తిపై మాత్రం వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుంది. చల్లని ప్రాంతాల్లో వాటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కరోనావైరస్ లాంటిదే మరొక వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) వ్యాప్తి మీద కూడా వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉంటుంది. వేడి వాతావరణంలో దీని వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం