Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ వేడినీటిలో పసుపు కలుపుకుని తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్..

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
రోజూ పరగడుపున వేడినీటిలో పసుపు కలుపుకుని టీలా తాగితే చెడు కొలెస్ట్రాల్ పరారవుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన కొవ్వు కరుగుతుంది. రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 
పసుపును నిత్యం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. క్యాన్సర్లు రాకుండా నియంత్రించడంలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి పసుపుకు ఉంది. 
 
పసుపు నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు పసుపులో ఉంటాయి. నిత్యం పసుపు కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments