Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రోజూ ఓ గ్లాసు టమోటో జ్యూస్ తాగితే..?

Webdunia
శుక్రవారం, 7 నవంబరు 2014 (14:23 IST)
మహిళలు రోజూ ఓ గ్లాసుడు టమోటా జ్యూస్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టమోటో  వీటిలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెజబ్బులను దూరం చేస్తుంది. 
 
ఇక రోజూ గ్లాసు పాలు తీసుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యానికి బలం చేకూరుతుంది. పాలలో విటిమిన్ డి కూడా ఎక్కువగానే ఉంటుంది. మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే ఆస్టియో ఆర్థరైటిస్ అవకాశాన్ని తగ్గించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పిఎంఎస్ సమస్య కూడా తగ్గుతుంది.
 
అలాగే రోజు వారీ డైట్‌లో ఓట్స్ తీసుకోవాలి. బిపి నుంచి మధుమేహం దాకా మంచి మందులా పనిచేసే ఓట్స్ గర్భిణి స్త్రీలకు మరింత మేలు చేస్తాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇక వారానికి ఓ రోజు చేపలు తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలను తీసుకోవడం ద్వారా ఒత్తిడి నుండి గుండెను పదిలం చేసుకోవచ్చు. తద్వారా గుండెపోటు లాంటి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చును. అలాగే రెండు రోజులకు ఒకసారి.. తోటకూర తీసుకోవాలి. తోటకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

Show comments