Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

సెల్వి
గురువారం, 19 జూన్ 2025 (19:31 IST)
Mango and Curd
మామిడి పండ్లు భారతదేశం అంతటా వేసవిలో అందరూ ఎంతో ఇష్టపడి తీసుకునేవి. చాలామంది మామిడి పండ్లను పెరుగుతో కలపడం ఒక క్లాసిక్ కాంబినేషన్. స్మూతీలు, షేక్‌లలో లేదా చల్లబరిచే స్నాక్‌గా దీనికి కలిపి తినవచ్చు. కానీ ఈ కాంబోతో ఆరోగ్యానికి మేలు చేస్తుందా అనేది తెలుసుకుందాం.
 
పాల ఉత్పత్తులతో పండ్లను కలపడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. అయితే జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. పెరుగులో ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అయితే మామిడి పండ్లలో డైటరీ ఫైబర్, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి, అవి జీర్ణ ప్రక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా లాక్టోస్ సెన్సిటివిటీ లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, బలహీనమైన జీర్ణక్రియ లేదా పాలు అంటే గిట్టని వారికి అంటే అలెర్జీ ఉన్నవారు ఈ కాంబోను మితంగా తీసుకోవాలి.
 
మామిడి, పెరుగు రెండూ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే పోషకాలను సమృద్ధిగా కలిగివుంటాయి. మామిడి పండ్లు విటమిన్ సి, బీటా-కెరోటిన్ మోతాదును అందిస్తాయి. మెరిసే చర్మానికి. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి గొప్పగా పనిచేస్తాయి. మరోవైపు, పెరుగులో జింక్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ రెండూ వేసవి అలసట, సాధారణ ఇన్ఫెక్షన్లకు దూరం చేస్తాయి. 
 
మామిడి పండ్లు త్వరగా విడుదల చేసే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. పెరుగు ప్రోటీన్,  కాల్షియంను అందిస్తుంది. ఈ రెండింటి కాంబోలో స్నాక్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  పెరుగులోని ప్రోటీన్ శక్తి స్థాయిలను నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఆకలిని దూరం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కిడ్నీ మార్పిడి- ఆపరేషన్ సమయంలో స్పృహ కోల్పోయి మహిళ మృతి

రూ.3 కోట్ల విలువైన డ్రోన్లు, ఐఫోన్లు, ఐవాచ్‌లు.. హైదరాబాదులో అలా పట్టుకున్నారు..

కాళ్లపై కారం కొట్టి బంగారు మంగళసూత్రాన్ని లాక్కున్న దుండగులు

ముంబై తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర : టార్గెట్ లిస్టులో ఇండియా గేట్

నవంబర్ 15కి వాయిదా పడిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలకు కాంగ్రెస్ సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12A రైల్వే కాలనీ చూస్తున్నప్పుడు ఎవరు విలన్ గెస్ చేయలేరు : అల్లరి నరేష్

సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న సిద్దం

Raja: క్షమాపణ, రాణి మారియా త్యాగం నేపథ్యంగా ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments