Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును కరిగించాలంటే?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:01 IST)
అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది. గ్రీన్ టీలో అస‌లు క్యాల‌రీలు ఉండ‌వు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఇత‌ర ఆహారాల‌పై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. 
 
ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. నిత్యం 2 నుంచి 3 క‌ప్పుల గ్రీన్ టీ ని తాగ‌డం అల‌వాటు చేసుకుంటే పొట్ట ఫ్లాట్ అవ‌డం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
గ్రీన్ టీ లో పాలీఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచుతాయి. దీంతో మ‌న శ‌రీరం క్యాల‌రీల‌ను త్వ‌ర‌గా ఖ‌ర్చు చేస్తుంది. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర మెట‌బాలిజం రేటు 4 శాతం వ‌ర‌కు పెరుగుతుంది.
 
గ్రీన్ టీలో చ‌క్కెర కాకుండా తేనె క‌లుపుకుని తాగితే ఇంకా అద్భుత‌మైన లాభాలుంటాయి. అయితే గ్రీన్ ఎంత ఆరోగ్య‌క‌రం అయినప్ప‌టికీ దాన్ని మోతాదుకు మించి సేవించ‌రాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేష‌న్‌, అసిడిటీ పెరుగుతాయి. క‌నుక గ్రీన్ టీని మోతాదులో తాగితే అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

తర్వాతి కథనం
Show comments