Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి?

ఎండాకాలంలో మజ్జిగ, కరివేపాకు పొడి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. కరివేపాకు, జీలకర్ర పొడి పాలల్లో కలిపి తీసుకొంటే అజీర్తి సమస్య దూరమవుతుంది. అలాగే కరివేపాకు రోజు ప

Webdunia
సోమవారం, 29 మే 2017 (15:49 IST)
ఎండాకాలంలో మజ్జిగ, కరివేపాకు పొడి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. కరివేపాకు, జీలకర్ర పొడి పాలల్లో కలిపి తీసుకొంటే అజీర్తి సమస్య దూరమవుతుంది. అలాగే కరివేపాకు రోజు పదేసి ఉదయం పూట పరగడుపున నమిలితే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే డయాబెటిక్ సమస్య అదుపులో ఉంటుంది. కరివేపాకును గుజ్జుగా చేసి లేదా జ్యూస్‌గా తాగినా బరువు తగ్గుతారు. డయేరియా సమస్య వుండదు. 
 
గాయాలకు కరివేపాకు గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీ మహిళల వికార సమస్య తగ్గాలంటే.. తేనె, స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని తీసుకోవాలి. ఎండిన కరివేపాకు పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి, ఆ తర్వాత తలంటు పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు బాగా పెరగటమే కాకుండా, నల్లగా అవుతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments