Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్రస్ పండ్లు తీసుకోండి.. గుండెపోటును దూరం చేసుకోండి!!

Webdunia
గురువారం, 29 మార్చి 2012 (17:05 IST)
FILE
సిట్రస్ పండ్లను మహిళలు తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. మహిళలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లను జ్యూస్ రూపంలోనూ లేదా అలాగే తీసుకోవడం ద్వారా గుండెపోటును నివారించవచ్చునని బ్రిటన్‌లోని తూర్పు ఆంగ్లినా యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

లెమన్, ఆరెంజ్, ఉసిరి లాంటి సిట్రస్ పండ్లతో పాటు ఆపిల్, దాక్ష, దానిమ్మ కాయలను తీసుకోవడం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మంచిదని, తాజా కూరగాయలు, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్‌లలో ఫ్లావోనోయిడ్స్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనంలో తేలినట్లు జిన్హువా పత్రిక పేర్కొంది.

మహిళలు ముఖ్యంగా విటమిన్ "సి"గల పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలని ఆంగ్లియా యూనివర్శిటీ ప్రొఫెసర్ అడిన్ కసిడీ తెలిపారు. సిట్రస్ పండ్లలోని ఫ్లావోనోయిడ్స్ గుండెకు సంబంధించిన రక్తపు నాళాల పనితీరును మెరుగుపరుస్తాయని, తద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని బ్రిటన్ వర్శిటీ అధ్యయనంలో తెలియవచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

Show comments