Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు మీద పడుతున్నా ఆరోగ్యంగా ఉండటం ఎలా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2013 (17:01 IST)
FILE
ఆరోగ్య సంరక్షణ అన్నది అందిరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం మంచి జీవన శైలి అంటే మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టి పెట్టడం అవసరం.

మన ఆహారంలో కాయగూరలు, ధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను వీలైనంత తగ్గించాలి. పీచు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువుగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.

నలభైల్లో ఉండేవారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌ను దీర్ఝకాలం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. అందునా శరీరాన్ని అతిగా కష్టపెట్టే బాడీ బిల్డింగ్ వ్యాయామాల కంటే తేలికపాటి శారీరక శ్రమ కలిగించే నడక వంటివి మంచి వ్యాయామ ప్రక్రియలని గుర్తించుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజులపాటు రోజూ 45 నిమిషాల పాటు నడవటం చాలా మంచిది.

పై జాగ్రత్తలతో పాటు పొగతాగడం, మద్యపానం, పొగాకు ఉత్పాదనలను నమలడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మంచి జీవనశైలిని పాటించినట్లవుతుంది. దీంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Show comments