Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. రోజూ ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారా?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2011 (16:06 IST)
FILE
పని మీద పని...క్షణం తీరిక లేకుండా రోజు గడిచిపోతుంది. సాయంత్రానికి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరిస్తోందని చెబుతుంటారు కొందరు. అటువంటప్పుడు సాధారణ ఆహారం కన్నా తక్షణ శక్తిని ఇచ్చే రకాలను ఎంచుకోవడం వల్ల మార్పు వెంటనే కనిపిస్తుంది.

* పెరుగు.. ఇది తక్షణ శక్తినందిస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు అలసిన మనసుకి ఉత్సాహాన్నిస్తాయి. ఇక పెరుగులోని మాంసకృత్తులు క్రమంగా శక్తినందిస్తూ ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడేట్టు చేస్తాయి. దీనిలోని ప్రొ బయోటిక్ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబులో బాధపడుతుంటే ఆ చికాకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని భోజనంలోనే కాకుండా.. రోజులో ఒకసారైనా అరకప్పు తీసుకుంటే మంచిది.

* కప్పు ఓట్‌మీల్‌ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్‍‌మీల్ లోని పీచు.. ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీ ఉత్సాహానికి ఊపునిస్తాయి. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు.

* చాలాసార్లు మనకు తెలియకుండానే పనిలో పడి గ్లాసు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల డిహైడ్రేషన్ తలెత్తుతుంది. ఫలితంగా చెప్పలేని నీరసం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసుడు చల్లని మంచినీటిని తాగండి. శక్తి పుంజుకొంటుంది. ఆ నీటిలో కొద్దిగా పంచదారో, ఉప్పో వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి. లేదా గ్లాసుడు పండ్లరసం... బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది. వీటిలో ఉండే ఎ, సి, బి1 విటమిన్లకు మిమ్మల్ని హుషారుగా ఉంచే శక్తి ఉంది.

* ఎండుద్రాక్ష, వాల్‌నట్లు, బాదం, అవిసెగింజల్లోని కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. వీటిలోని అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తాయి. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తే.. ఇవి గుప్పెడు తిని చూడండి. ఇవి చక్కని అల్పాహారం కూడా.

* రోజువారీ ఆహారంలో ఇనుము ఉండేలా చూసుకొంటే మాటిమాటికీ నిస్సత్తువ ఆవరించదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. నిస్సత్తువ ఆవరించదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. నిస్సత్తువకు మరోకారణమైన రక్తహీనత సమస్య కూడా బాధించదు.

* రోజంతా హుషారుగా ఉండాలంటే.. ప్రతిరోజు కప్పు గ్రీన్‌టీ తాగాలి. వీటిలోని పోషకాలు శరీరానికి శక్తినందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Show comments