Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. ఆలస్యం చేయకండి.. ఖర్జూరాలు తీసుకోండి!

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2012 (17:44 IST)
FILE
మహిళలు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనదేశంలో మహిళలు ఖర్జూరాలను తప్పకుండా ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయుసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది.

ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఎంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతుంది.

ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్ అని పిలిచే ప్లేవనాయిడ్ పాలిఫీనాలిక్ యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తస్రావాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది.

వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి వాటిని నివారిస్తుంది. ఎందుకు మరి ఆలస్యం ఈరోజు నుంచే ఖర్జూరం తినడం మొదలు పెట్టండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

Show comments