Webdunia - Bharat's app for daily news and videos

Install App

బానపొట్ట... బండ బరువు తగ్గించుకునేదెలా..?!!

Webdunia
FILE
సరియైన ఆహారపుటలవాట్లను పాటించకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల అధికబరువు సమస్య తలెత్తుతుంది. అంతేకాదు ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోలేక, ఆ తర్వాత ఆదరాబాదరాగా అమితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్ట పెరుగుతుంది. మొత్తమ్మీద బానపొట్టతో బండబరువుతో సతమతమైపోతారు. ఈ బానపొట్టను, అధిక బరువుకు కారణాలేమిటో చూద్దాం.

శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం. భోజనానికి భోజనానికి మధ్య విరామము లేకుండా ఏదో ఒకటి తినడం. మానసికంగా ఒత్తిడికి గురి అయినప్పుడు తీసుకునే ఆహారం మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా లావు పెరగడం ప్రారంభమవుతుంది.

అంతేకాదు కొన్ని రకాల మందులు కూడా అధిక బరువుకు కారణమవుతాయి. స్త్రీలలో గర్భసంచి తొలగింపు సర్జరీ చేయడం వల్ల ఈ స్థూలకాయం సమస్య ఎదురవుతుంది. హార్మోన్ల అసమతౌల్యం వల్ల కూడా అధికబరువు సంతరించుకుంటుంది.

వదిలించుకునే మార్గాలు
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

పండ్లు, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటుండాలి. మాంసాహారం, వేపుళ్లు, బేకరి ఫుడ్స్, ఐస్‌క్రీములు, కేకులు, బిర్యాని వంటి వాటిని మానివేయాలి. భోజనానికి భోజనానికి మధ్య చిరుతిండ్లను మానివేయాలి. అధికంగా ఉప్పు, స్వీట్లను తీసుకోకూడదు.

తగినంత నీటిని తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి. అయితే బరువు అనేది ఏదో నెలకో రెండు నెలలకో తగ్గిపోతుందని అనుకోవడం పొరపాటు. బరువు పొట్ట తగ్గడానికి నియమిత ఆహారప్రణాళిక క్రమబద్ధమైన జీవన విధానాన్ని దీర్ఘకాలికంగా ఉండాలన్నది గుర్తుంచుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Show comments