Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్‌పై మోజు ఆరోగ్యానికి తప్పని కీడు

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (16:15 IST)
ప్లాస్టిక్ వస్తువులు లేని ఇల్లు ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవచ్చు. ఎందుకంటే వంటింటిలో ఎప్పటినుంచో స్త్రీల హృదయాలను గెలుచుకున్న స్టీల్ పాత్రలు ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువుల దెబ్బకు తెల్లబోతున్నాయి మరి. బరువైన స్టీల్ పాత్రను తేలికగా ఉండే ప్లాస్టిక్ వస్తువులు కైవశం చేసుకోవడంతో ఈ కాలం వంటిళ్లలో అక్షరాలా ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది.
తేలిక ఒక్కటే కాదు ముఖ్యం..
  స్మార్ట్ ఈజ్ బ్యూటిపుల్... సామెతగా బాగానే ఉంటుంది కానీ, వంటింట్లో స్టీల్ పాత్రలను తోసిరాజని దూసుకొచ్చిన ప్లాస్టిక్ వస్తువు వాడకానికి సంబంధించి బాగుండదు. దీన్ని ఎందుకు వాడకూడదో కొత్త కోణంలో కూడా తెలుస్తోంది. దాని రసాయనం మనిషి వికాసానికి ప్రమాదకరం.      


దానికి తోడు ప్లాస్టిక్ వస్తువులు పలు రకాల వినియోగాలను తీరుస్తూ తమ ఉనికిని ప్రపంచమంతటా చాటుకుంటున్నాయి. కేవలం ఆహార పదార్ధాలను నిల్వ చేసుకోవడం మాత్రమే గాక, ఫ్రిజ్‌లో మంచి నీటిని తదితర పదార్ధాలను పెట్టుకోవడానికి కూడా మహిళలు ప్లాస్టిక్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

పైగా ఫ్రిజ్‌లో మంచి నీటిని ఉంచుకోవడానికి చాలా మంది మహిళలు కూల్ డ్రింక్ బాటిళ్లు ఉపయోగిస్తుంటారు. ఇలా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వచేసిన మంచినీటిని, పదార్ధాలను తీసుకోవడం వల్ల మతిమరుపు రావడమే కాక బుద్ధి మందగించడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

ప్లాస్టిక్ పాత్రల తయారీలో వాడే బిస్ఫినాల్ -బీపీఏ- అనే రసాయన పదార్థం వల్ల మెదడు పనితీరులో మార్పులు వస్తాయని కెనడా శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో మనుషులలో చదవడం, నేర్చుకోవడం వంటి విషయాల్లో సామర్థ్యం కొరవడుతుంది.

పైగా, ప్లాస్టిక్ బాటిళ్లలో, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన పదార్ధాలు తీసుకుని తినడం వల్ల బీపీఏ మన శరీరంలో ప్రవేశించి మెదడు పనితీరును క్రమక్రమంగా కుంటుపరుస్తుందని కెనడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మొత్తం మీద ప్లాస్టిక్ వస్తువు వంటింట్లో మహిళలకు తేలికదనాన్ని ప్రసాదించి ఉండవచ్చు కాని దానిలోని ప్రమాద కారకం మన ఆరోగ్యంపై భారం మోపుతోందని అర్థమవుతోంది కదా. కాబట్టి ప్లాస్టిక్‌ను పూర్తిగా మానేయడం కాక వీలైనంత వరకు దాని వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది మరి...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Show comments