Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం చేసే మగువలు.. ఇలాంటి ఆహారం తీసుకోవాల్సిందే!

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2013 (12:03 IST)
FILE
ఉద్యోగం చేసే మగువలు రోజువారీ జీవితంలో వివిధ రకాల బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు పిల్లలకు తల్లిగాను, భర్తకు భార్యగాను ఇంట్లో ఇతర పనులన్నింటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో వారు తమ ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ చూపరు. దీంతో పలు రకాలైన అనారోగ్య సమస్యలతో వారు సతమతమవుతుంటారు. అందుకే ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటి ఆహారం తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఉద్యోగం చేసే మహిళలకు ఎముకలు బలంగా ఉండాలి. ఇందుకోసం రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం. ఇందుకోసం శరీరంలో కాల్షియం ఉత్పత్తులు పెరగడానికి తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

అలాగే తాజా ఆకుకూరలను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. అలాగే నెలసరి సమస్యవల్ల శరీరానికి ఐరన్‌ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆహారంలో బీన్స్‌, రాగులు, కర్జూరం, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి. రోజుకు కనీసం 12 నుండి 15 మిల్లీగ్రాముల ఐరన్‌ తీసుకోవాలి. శరీరానికి తగిన శక్తి కోసం విటమిన్‌ సి ని తీసుకోవాలి.

రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు పనిచేసే ఉద్యోగినులు వీలైనప్పుడల్లా ఏదో ఒక పండు తినాలి. టమోటా, నిమ్మ, బంగాళాదుంపలతోబాటు జామపండ్లు, నారింజ, బత్తాయి ఇలా ఏదో ఒక పండు తినాలి. వీటిలో విటమిన్‌ సితోబాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలా కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వల్ల ఉద్యోగినులు ఆరోగ్యంగా ఉంటూ, చక్కగా చురుగ్గా తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Show comments