Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసీస్ మహిళల్లో కెరీర్ డ్రింకింగ్ ప్రమాదం

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2008 (17:36 IST)
పురుష ఉద్యోగులతో పాటు కెరీర్‌లో భాగంగా తాగడం అలవాటు చేసుకున్న ఆస్ట్రేలియా మహిళలు ఆల్కహాల్ సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారని తాజా సర్వేలో తేలింది. పశ్చిమ సిడ్నీ యూనివర్శిటీ నిర్వహించిన ఈ సర్వేలో 35-55 సంవత్సరాల మధ్య వయసు గల 120 మంది కెరీర్ మహిళలు పాల్గొన్నారు.

స్త్రీ పురుషుల మధ్య ఆల్కహాల్ జీవన చక్రంలో భారీ స్థాయి వ్యత్యాసం చోటు చేసుకున్నట్లుగా ఈ సర్వే పేర్కొంది. ఇలా ఆఫీసు అవసరాల కోసం పురుషులతో కలిసి తాగేవారు మత్తు పానీయాలకు దాసోహమై సూపర్ మమ్ సిండ్రోమ్‌ను అలవర్చు కుంటున్నారని ఈ సర్వే తెలిపింది.

వీరిలో చాలామంది ప్రయివేటుగా తాగుతూ, తన మద్యపానీయ స్థాయిని బహిర్గతం చేయకుండా ఉండటమే కాక వాటినుంచి బయటపడేందుకు సహాయం అడిగేందుకు కూడా వెనుకాడుతున్నారని సర్వేకు నేతృత్వం వహించిన రీసెర్చర్ జెనీస్ వితనాల్ చెప్పారు. ఆస్ట్రేలియాలోని మద్యపాన సంస్కృతి మరియు ఫెమినిస్టు ఉద్యమంలో ఈ సమస్యకు మూలం దాగుందని ఆమె పేర్కొన్నారు.

తమ సహోద్యోగులతో సరిసమానంగా నిలిచేందుకు గాను ఉద్యోగ మహిళలు తాగడం అలవర్చుకుంటున్నారని, జాతీయ గణాంకాల ప్రకారం చూస్తే నడి వయస్సు గ్రూప్ మహిళలు మద్యపానీయంతో బాధపడుతున్నారని జెనీస్ వితనాల్ చెప్పారు. పగలు రాత్రి భోజనాల సమయంలోనే చాలావరకు వ్యాపార వ్యవహారాలు నిర్వహించబడుతున్నందున మహిళలు పురుషులతో కలిసి మందు సేవించడం అలవాటుగా మారుతోందని చెప్పారు.

కెరీర్లో ముందుకెళ్లాలంటే యువకులతో కలిసి తామూ తాగవలసిన అవసరం ఉందని 20లలోని యువతులు భావిస్తున్నారని, అయితే 30వ పడిలో పడగానే తాము పూర్తిగా అదుపు తప్పిన విషయం వారికి అనుభవంలోకి వస్తోందని ఆమె చెప్పారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Show comments