Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని పోషకా పదార్ధాల ప్రతిరూపం చెర్రీ రసం

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2008 (18:43 IST)
FileFILE
మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులు కలిగిన వారికి ప్రమాదం కావచ్చు కాని చెర్రీ రసం ఇతరులకు అమృతంతో సమానమని బ్రిటన్ వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. బ్రిటన్‌లో ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పావు లీటరు పరిమాణం ఉండే గ్లాసు చెర్రీరసంలో ఇతర పండ్లు, కూరగాయలలో కంటే 23 రెట్లు అధికంగా పోషక పదార్థాలున్నట్లు తెలిసింది.

బఠాణీలు, టొమోటోలు, కర్భూజా, కేరట్లు, అరటిపండ్లతో పోలిస్తే చెర్రీ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఐదు రెట్లు అధికంగా ఉంటాయని వెల్లడైంది. కేన్సర్, గుండెజబ్బులు, వృద్ధాప్యం తదితర సమస్యలకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను ఈ యాంటీ యాక్సిడెంట్లు సమర్థంగా నిరోధించగలవు.

కూరగాయలు, పండ్లలో ఫ్రీరాడికల్స్ నివారణ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరిశోధనలు జరిపిన పోషకాహార నిపుణుడు డాక్టర్ రాబర్ట్ వెర్క్‌ర్క్ చెర్రీలలో ఈ శక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన తన పరిశోధన వివరాలను "న్యూట్రిషనల్ ప్రాక్టీషనర్" పత్రికలో ప్రచురించారు.

అన్నిరకాల చెర్రీ పండ్లలోనూ... యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఒకే రీతిగా ఉండదని, ముఖ్యంగా అమెరికాలో పండే మాంట్‌మరెన్సీ రకం చెర్రీల్లో ఇవి అత్యధికంగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

కాబట్టి సుగర్, అధిక బరువు ఉన్న రోగులను మినహాయిస్తే ప్రతి ఒక్కరూ చెర్రీ పండ్ల రసాన్ని సేవించవచ్చు. వ్యర్థ శీతల పానీయాలను తాగడం కంటే ఇది శరీరానికి అవసరమైన పోషకాలను సులువుగా అందిస్తుంది మరి...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

Show comments