Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా కనిపించాలంటే.. మేకపే సరిపోదు.. పోషకాహారం తీసుకోండి!

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2013 (15:43 IST)
FILE
అందం అనేది కేవలం మేకప్‌ వల్లే రాదు. చక్కటి పోషకాహారం తీసుకోవడం ద్వారా చర్మం కాంతిమంతంగా మారుతుంది. మీ మోము తాజాగా మెరవడానికి ఐదు రకాల ఆహారాన్ని తరచూ తీసుకుంటే చాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

నిమ్మరసం : చర్మాన్ని తాజాగా ఉంచి, ముడతలు పడనీయకుండా చూస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకున్నా లేదా రోజూ అర గ్లాసుడు తీసుకున్నా మీ చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసంతో చేసిన పదార్థాలను విరివిగా తినడం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.

గుడ్లు : రోజుకో గుడ్డు తింటే మంచిది అంటారు. తినడమే కాదు. గుడ్డులోని తెల్లసొనను తీసి ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మం నునుపు దేలి మెరుస్తుంది.

తేనె : ఉదయాన్నే ఒక చెక్క నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూను వేసుకుని తాగితే మంచిది. అలాగే దీనిని రోజు ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.

స్ట్రాబెర్రీస్ : ఎర్రని స్ట్రాబెర్రీలు నెలలో నాలుగైదు సార్లు తినడం వల్ల చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. విటమిన్ 'సి' యాంటిఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని మెత్తగా చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

అరటి పళ్లు : రోజుకో అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా తింటున్నప్పుడు చిన్న ముక్కతో ముఖమంతా రుద్దుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మానికి మేలు. తేనెలో ముంచి రాసుకున్నా ముఖం తాజాగా కనిపిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments