Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేదం : తులసీ ఆకుల ప్రయోజనం ఏమిటి?

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:26 IST)
ఆయుర్వేదంలో తులసికి కీలక స్థానముంది. వాత, పిత్త, కఫానికి చెక్ పెట్టే తులసిని రోజూ రెండేసి ఆకులు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళాదుంపలు, మాంసంలో వాతం ఉందని, వంకాయ, బొప్పాయి, చికెన్‌లో పిత్తం అధికంగా ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే ఉల్లిపాయలు, టమోటా, కోడిగుడ్లలో కఫం ఉందని వారు చెబుతున్నారు.  
 
ఈ మూడింటిని సమానంగా తీసుకుంటే పర్లేదు. అయితే పరిమాణంలో హెచ్చుతగ్గులుంటే కష్టమే. అయితే పిత్త, వాత, కఫాలను సక్రమంగా ఉంచాలంటే  వాతానికి బిల్వం, పిత్తాన్ని సరిచేసేందుకు వేప, కఫాన్ని సక్రమంగా ఉంచేందుకు తులసిని ఉపయోగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 ఇందులో తులసి కఫంతో ఏర్పడే శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. తులసీ ఆకులు.. దగ్గు, జలుబు, తలనొప్పి, శ్వాస పీల్చుటలో కష్టం, అలెర్జీలకు చెక్ పెడుతుంది.
 
పది గ్రాముల తులసీ ఆకులను నులుమి రసం తీసుకుని రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలూ.. ఇలా వారం రోజులు తీసుకుంటే జలుబు దరిచేరదు. ఐదు గ్రాముల తులసీ ఆకులు, రెండే రెండు మిరియాలు చేర్చి వేడినీటిలో తెల్లనిచ్చి ఆ నీటిని తీసుకుంటే జ్వరంతో కూడిన జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
అలాగే పది ఆకులు తులసి, కొంచెం అల్లం రెండింటిని వేడినీటిలో ఉడికించి ఆ రసంలో కాస్త తేనె కలుపుకుని తీసుకుంటే ఆస్తమా, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments