Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ దివ్యౌషధ రూపిణి.. ఆ ఆకులతో టీ సేవిస్తే?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (13:04 IST)
Tulasi Tea
అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి ఒకటి. ఈ మొక్కను లక్ష్మీదేవిగా పూజిస్తారు. శ్రేయస్సుకు తులసి చిహ్నం. తులసి మొక్క మంచి క్రిమిసంహారక, యాంటీ ఆక్సిడెంట్. దాని ఆకుల నుండి దాని మూలాల వరకు ఔషధ గుణాలు ఎన్నో వున్నాయి. 
 
వివిధ ఆరోగ్య సమస్యలను తిప్పికొట్టేగల శక్తి తులసీలో వుంది. జలుబు, ఫ్లూకి తులసి మంచి మందు. తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి అందులో తగినంత బెల్లం, కలుపుకుని టీలా తాగితే జలుబు తగ్గుతుంది. తులసి వల్ల మొటిమల వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే మొటిమలు మాయమవుతాయి. 
 
తులసి ఆకులను నమలడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ పెరుగుతుంది. తులసి, నిమ్మరసం కలిపి మెత్తగా నూరి రాసుకుంటే పురుగు కాటు బెడద తొలగిపోతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే గొంతునొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది. 
 
తులసి ఆకుల రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.  తులసి వేరును పురుగు కాటుపై పూయడం చాలా మంచిది. ఈ తులసీ నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్- వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. ఇవి ఎన్నికలా? సిగ్గుగా వుందంటూ జగన్ ఫైర్ (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

Supreme Court: వీధుల్లో కుక్కలు తిరగడం ఎందుకు? సుప్రీం కోర్టు సీరియస్.. అలెర్ట్ అవసరం (వీడియో)

బంగ్లాదేశ్ బాలికపై 200మంది లైంగిక దాడి.. 3 నెలల పాటు నరకం చూపించారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments