Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లిని రోజూ తీసుకుంటే... రోగనిరోధక శక్తి..?

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (13:19 IST)
ప్రతి భారతీయుడి వంటగదిలో వెల్లుల్లి తప్పనిసరి. వెల్లుల్లిలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయని, రోజువారీ ఆహార పదార్థాల తయారీలో దీనిని ఉపయోగించడం వల్ల రుచి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వీటిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ వెల్లుల్లిని ఎందుకు తీసుకోవాలి అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. కాబట్టి దీన్ని ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అంతే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
అంతే కాకుండా గుండెపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు రక్తాన్ని పల్చగా మార్చేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించడంలో దీని గుణాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా సహాయపడుతుంది. 
 
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి వెల్లుల్లి గొప్ప ఔషధం. ఇది శరీర బరువును సులభంగా నియంత్రించడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ వెల్లుల్లిని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. 
 
అంతేకాకుండా, వెల్లుల్లిలో ఉండే కొన్ని మూలకాలు ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments