నేరేడు పండును తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి..

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (12:08 IST)
నేరేడు పండ్లను తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. నేరేడు పండు గింజలు మధుమేహాన్ని నియంత్రించే శక్తిని కలిగివుంటాయని.. ఆ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని ఉపయోగించుకుంటే మధుమేహం ఆమడ దూరంలో నిలిచిపోతుందని వారు సూచిస్తున్నారు. 


నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి.. పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.


కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను చంపేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఎందుకు చంపాడు.. ఏంటి సమాచారం?

పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్ చేయండి, కేంద్ర రైల్వే మంత్రికి డిప్యూటీ సీఎం పవన్ విన్నపం

నాగర్‌కర్నూల్ జిల్లాలో 100 వీధి కుక్కలను చంపేశారు.. సర్పంచ్‌కు సంబంధం వుందా?

మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ.. ఎక్కడ?

చెట్టుకు చీర కట్టినా దాని దగ్గరకు వెళ్లిపోతాడు: అరవ శ్రీధర్ పైన బాధితురాలు వ్యాఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

Hreem: షూటింగ్‌ పూర్తి చేసుకున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం హ్రీం

తర్వాతి కథనం
Show comments