తలనొప్పి ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వద్దు.. ఆ టీ ఒక గ్లాస్..

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (20:56 IST)
చాలామంది ఒత్తిడికి లోనై ప్రతిరోజు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పి తగ్గేందుకు ఇష్టమొచ్చినట్లు టాబ్లెట్లు వాడేస్తుంటారు. అది సైడ్ ఎఫెక్ట్‌గా మారుతుందన్న విషయాన్ని పక్కనబెట్టేస్తారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం తలనొప్పికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక టీ తాగితే సరిపోతుందన్నారు ఆయుర్వేద నిపుణులు. అదేమిటంటే.. పుదీనా టీ. 
 
మన ఇంటిలోని వస్తువులతోనే ఈ టీను తయారుచేసుకుని తాగితే తలనొప్పి మొత్తం ఎగిరిపోతుంది. పుదీనా టీను తయారుచేసుకోవడం చాలా ఈజీ. పుదీనా ఆకులు గుప్పెడు, గ్రీన్ టీ బ్యాగులు, రెండు చెంచాలు తేనె, నీళ్ళు రెండు కప్పులు, పుదీనా ఆకులని నీళ్ళలో వేసుకుని మంచి పరిమళం వ్యాపించే వరకూ నీటిని తక్కువ మంటపైన మరిగించుకోవాలి. ఆపైన గ్రీన్ టీ బ్యాగులు లేదా పొడి చేసి వడకట్టుకుని తేనె, నిమ్మరసంతో కలిపి సర్వ్ చేసుకుంటూ రుచిగా ఉంటుంది. 
 
జలుబుని తగ్గించడంతో పాటు అజీర్తి సమస్యని అదుపులో ఉంచుతుంది పుదీనా టీ. అంతే కాదు తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. నెలసరి ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు పుదీనా టీ చక్కని ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh : మెగా డీఎస్సీ వేడుక.. పవన్‌కు నారా లోకేష్ ఆహ్వానం

మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైకాపా నేతలు 106 కేసులు వేశారు : మంత్రి నారా లోకేశ్

కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీతి సింగ్ అరెస్టు

సహోద్యోగుల వేధింపులు.. మహిళా టీచర్‌పై వేధింపులు.. భర్త అస్సాంలో.. భార్య ఆత్మహత్య

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పలువురు అమ్మాయిల అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్, OG ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌రివ్యూ

బ్యూటీ అందరి మనసులకు హత్తుకునే చిత్రం.. సక్సెస్ మీట్‌లో సీనియర్ నటుడు వీకే నరేష్

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే నుంచి హీరో ఉన్ని ముకుందన్ బర్త్ డే విషెస్ పోస్టర్ రిలీజ్

మనీ లాండరింగ్ కేసు : బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఎదురుదెబ్బ

తర్వాతి కథనం
Show comments