రావి ఆకులను మెత్తగా నూరి పొడి చేసి తేనెతో సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయం అవుతాయి. దానిమ్మ ఆకులను పొడిచేసి కషాయం కాచి త్రాగటం వలన అజీర్తి, ఉబ్బసం తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంటుంది.
మారేడు ఆకుల్ని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఇలా క్రమంతప్పకుండా తీసుకోవటం వల్ల మూలశంక నయమవుతుంది.
నేల మునగ ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గుతుంది. ఇది మన శరీరమునకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. తులసి ఆకులను శుభ్రపరచుకొని రోజూ ఐదారు ఆకుల చొప్పున తినినచో దగ్గు, వాంతులు, జలుబు తగ్గుతాయి.