జాస్మిన్ ఆయిల్ ఇంట్లోనే చేయడం ఎలాగో తెలుసా?

మల్లెలకు మానసిక ప్రశాంతతను ఇచ్చే సుగుణం వుంది. అలాగే మల్లెల నూనెను వాడటం ద్వారా ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆహ్లాదం చేకూరుతుంది. మల్లె నూనె మనసును ఆహ్లాదంగా మార్చుతుంది. అలాంటి మల్లెలతో నూనె ఎలా చేయాలం

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (17:36 IST)
మల్లెలకు మానసిక ప్రశాంతతను ఇచ్చే సుగుణం వుంది. అలాగే మల్లెల నూనెను వాడటం ద్వారా ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆహ్లాదం చేకూరుతుంది. మల్లె నూనె మనసును ఆహ్లాదంగా మార్చుతుంది. అలాంటి మల్లెలతో నూనె ఎలా చేయాలంటే..? గుప్పెడు మల్లెలను నలగ్గొట్టినట్లు చేసి ఆలివ్ నూనెలో వేయాలి. రెండు రోజుల తర్వాత వడగడితే సరిపోతుంది. అంతే మల్లెల నూనె రెడీ అయినట్లే. 
 
అలాగే గులాబీ నూనెను ఎలా చేయాలంటే.. ఒక కప్పు గులాబీ రేకులను తీసుకుని కచ్చాపచ్చాగా చేసుకుని వాటిని ఒక కప్పు కొబ్బరి నూనెలో వేయాలి. ఒక రోజు మొత్తం అలానే వుంచి మరుసటి రోజు వడగట్టాలి. మళ్లీ అదే నూనెలో ఇంకాస్త గులాబీ రేకుల ముద్ద వేయాలి. ఇలా నూనెకు మంచి వాసన వచ్చేవరకు కనీసం నాలుగైదు సార్లు వేస్తే రోజ్ ఆయిల్ రెడీ అయినట్లే. 
 
ఇక దంతాలకు మేలు చేసే లవంగం నూనెను ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..?  చిన్న గాజుసీసా తీసుకుని అందులో సగం వరకు ఆలివ్ ఆయిల్ పోయాలి. గుప్పెడు లవంగాలు వేసి పదిరోజుల వరకు వెలుతురు లేని చోట వుంచాలి. ఆ తర్వాత బయటకుతీసి నూనెను వడగడితే.. లవంగాల నూనె సిద్ధమైనట్లే. ఈ నూనెతో దంతాలకు మాసానికి రెండుసార్లు తోమితే దంతాలు మెరిసిపోతాయి. చిగుళ్ల వ్యాధులుండవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

దేశంలో సుధీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది?

భాష అనేది ఒక చాయిస్ మాత్రమే.. బలవంతంగా రుద్దలేం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments